గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 21:31:52

మ‌హ‌వీర్ చ‌క్ర‌తో వంద‌శాతం సంతృప్తి చెంద‌ట్లేదు: స‌ంతోష్ తండ్రి

మ‌హ‌వీర్ చ‌క్ర‌తో వంద‌శాతం సంతృప్తి చెంద‌ట్లేదు: స‌ంతోష్ తండ్రి

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని గాల్వాన్ లోయ‌లో చైనాతో గ‌తేడాది జూన్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పాలైన క‌ల్న‌ల్ సంతోష్ బాబుకు మ‌హావీర చ‌క్ర పుర‌స్కారంతో తాను 100 శాతం సంతృప్తి చెందడం లేదని ఆయ‌న తండ్రి బీ ఉపేంద్ర పేర్కొన్నారు. త‌న త‌న‌యుడిని ప‌ర‌మ‌వీర చ‌క్ర‌తో గౌర‌వించాల‌ని అభిప్రాయ ప‌డ్డారు. ‘నాకు అసంతృప్తి లేదు. కానీ నేను (మ‌హావీర‌చ‌క్ర అవార్డుతో) వంద‌శాతం సంతృప్తి చెంద‌డం లేదు. మ‌రింత మెరుగ్గా నా కొడుకునే గౌర‌వించ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ ఆయ‌న విధుల‌కు గుర్తింపుగా సంతోష్‌బాబును అత్యున్న‌త మిలిట‌రీ అవార్డు ప‌ర‌మ వీర‌చ‌క్ర‌తో గౌర‌వించాల‌ని నా అభిప్రాయం’ అని ఉపేంద్ర పీటీఐకి చెప్పారు. 

‘నా కొడుకు చూపిన శౌర్య ప‌రాక్ర‌మాలు సైనిక బ‌ల‌గాల్లో ప‌ని చేస్తున్న వారితోపాటు ప‌లువురికి స్ఫూర్తినిచ్చాయి’ అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు. గ‌తేడాది జూన్ 15వ తేదీన గ‌ల్వా‌న్ లోయ‌లో చైనా సైన్యంతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 16వ బీహార్ రెజిమెంట్ క‌మాండింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ సంతోష్‌బాబుతో స‌హా 20 మంది సైనికులు ముఖాముఖీ పోరాడి అశువులు బాసి అమ‌రులు అయ్యారు. ప‌లు ద‌శాబ్దాలుగా చైనా, భార‌త్ మ‌ధ్య తీవ్రంగా జ‌రిగిన సైనిక ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇదొక‌టిగా నిలిచింది.గ‌ల్వాన్‌లోయ‌లోని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తో త‌లెత్తిన స‌వాళ్ల‌ను అధిగ‌మించి చైనా బ‌ల‌గాల‌తో త‌న కొడుకు పోరు స‌ల్పాడ‌ని ఉపేంద్ర అభిప్రాయ ప‌డ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo