ఏం పీకనీకి ఎవుసం చేస్తున్నవ్?
‘కరెంటు ఎన్ని గంటలకు వస్తుంది. నీకు తెల్వదా? మరి ఏమి పీకనీకి వ్యవసాయం చేస్తున్నవు’ అంటూ న్యాయం చెప్పండని వేడుకొన్న అన్నదాతపై ఎస్సై ప్రదర్శించిన కాఠిన్యమిది.
- పోలీస్‌స్టేషన్‌లో రైతుపై ఎస్సై దాష్టీకం
- సమస్య ఉన్నదని పోతే రక్తం కారేలా దాడి
- ఎస్సై మల్లారెడ్డిపై సీపీ చర్యలు
గజ్వేల్, అక్టోబర్ 24: ‘కరెంటు ఎన్ని గంటలకు వస్తుంది. నీకు తెల్వదా? మరి ఏమి పీకనీకి వ్యవసాయం చేస్తున్నవు’ అంటూ న్యాయం చెప్పండని వేడుకొన్న అన్నదాతపై ఎస్సై ప్రదర్శించిన కాఠిన్యమిది. న్యాయం దక్కుతుందని నమ్మి పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిన ఆ అన్నదాతపై ఆ ఎస్సై దౌర్జన్యానికి దిగాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని ఠాణాకు వెళ్లిన రైతును రక్తమొచ్చేలా కొట్టి గాయపర్చాడు. బాధితుడు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు భీమరి రవి, అతని అన్నదమ్ముల మధ్య వ్యవసాయ పొలం వద్ద నీటి సరఫరా విషయంలో గొడవ జరిగింది. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో చెప్పుకొందామని రైతు రవి శనివారం గజ్వేల్ స్టేషన్‌కు వెళ్లాడు. విధుల్లో ఉన్న ఎస్సై మల్లారెడ్డి కరెంట్ ఎన్ని గంటలకు వస్తుందని రైతు రవిని ప్రశ్నించాడు. అతను సమాధానం చెప్పలేదనే అక్కసుతో.. ‘ఏమీ పీకనీకి వ్యవసాయం చేస్తున్నవు’ అంటూ రైతు రవి చెంపపై ఎస్ఐ మల్లారెడ్డి కొట్టడంతో కనుబొమ్మ వద్ద గాయమై తీవ్ర రక్తస్రావమైంది.
గాయాలపాలైన బాధిత రైతును చికిత్స కోసం సకాలంలో ప్రభుత్వ దవాఖానకు తరలించకుండా స్టేషన్లో ఉంచారు. అక్కడికి చేరుకున్న బంధువులు గాయాలపాలైన రవిని చూసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని రైతును చికిత్స కోసం దవాఖానకు తరలించారు. రైతు రవికి ఎస్సైకి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ క్రమంలో ఎస్సై కొట్టడంతో రైతు రవికి గాయమై రక్తం వచ్చిందని ఈ సందర్భంగా ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఏఆర్ హెడ్‌క్వార్టర్‌కు ఎస్సై అటాచ్
గిరిపల్లి రైతు భీమరి రవిపై రక్తమొచ్చేలా కొట్టిన ఎస్సై మల్లారెడ్డిపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ శనివారమే ఉత్తర్వులు జారీచేశారు. రైతుపై ఎస్సై దాడి ఘటన విషయం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

