హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బోయిన్పల్లి మార్కెట్ యార్డుకు చెందిన రూ.400 కోట్ల విలువైన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత గజ్జెల నగేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ, కంటోన్మెంట్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నగేశ్ డిమాండ్ చేశారు.