గోడలకు సున్నాలేసేటోడు.. ప్రజలకు సున్నం పెడ్తుండు
గోడలకు సున్నాలేసేటోడు.. నేడు ప్రజలకు సున్నం పెడ్తుండు.. అని ‘సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ధ్వజమెత్తారు. పేదోడు సీఎం కుర్చీలో ఉంటే ఓరుస్తలేరని, పేద కుటుంబంలోనుంచి, నల్లమల అడవుల్లోంచి వచ్చిన అని చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అసలు తనెవరో తనకే క్లారిటీ ఉందా అని ఎద్దేవాచేశారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
- సీఎం రేవంత్‌పై గాదరి కిశోర్ ధ్వజం
తిరుమలగిరి అక్టోబర్ 1 : గోడలకు సున్నాలేసేటోడు.. నేడు ప్రజలకు సున్నం పెడ్తుండు.. అని ‘సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ధ్వజమెత్తారు. పేదోడు సీఎం కుర్చీలో ఉంటే ఓరుస్తలేరని, పేద కుటుంబంలోనుంచి, నల్లమల అడవుల్లోంచి వచ్చిన అని చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అసలు తనెవరో తనకే క్లారిటీ ఉందా అని ఎద్దేవాచేశారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సిరిసిల్ల సభ దండయాత్ర లెక్కలేదు,.. దండు పాళ్యం బ్యాచ్ కలిసి యాత్ర చేసినట్టుగా ఉన్నదని’ ఎద్దేవాచేశారు. కేటీఆర్ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోరని తెలిపారు.
ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకొని, ఇచ్చిన హమీలు అమలు చేయాలని సూచించారు. సిరిసిల్లలో కేటీఆర్‌పై గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానన్న రేవంత్ ఎంత దైన్యమైన పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలని గాదరి కిశోర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

