హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎస్వోఏ) అధ్యక్షుడిగా డాక్ట ర్ జీ సురేశ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఆయన రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సంఘానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో 19 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసిస్టెంట్ సెక్రటరీ నుంచి అడిషనల్ సెక్రటరీ క్యాడర్ వరకు అధికారులు తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పీ లింగమూర్తి గెలుపొందారు. ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, ఏడుగురు కార్యదర్శులు, కోశాధికారి, ఐదుగురు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నట్టు వెల్లడించారు.