హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసొసియేషన్ అధ్యక్షుడిగా జీ పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి ప్రదీప్‌కుమార్ ప్యానల్‌పై పురుషోత్తంరెడ్డి ప్యానల్ విజయం సాధించింది.
ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నగరశాఖ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు కొత్త కార్యవర్గాన్ని అభినందించారు. ప్రధాన కార్యదర్శిగా వై పరశురామ్, సభ్యులుగా శ్రీనివాస్‌రావు, శిరీష, లావణ్య, కవిత, సాయిరెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, కృష్ణయ్య, శ్రీనివాస్, సుధాకర్, వీణ, సుభద్ర గెలుపొందారు.