జనగామ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్ భావి భారత దార్శనికుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన తెలంగాణ అభివృద్ధి ని దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
అన్ని రంగాల్లో ఎవరూ ఊహించని విధంగా చారిత్రక గుణాత్మక మార్పులను సాధించారని అన్నారు.కేసీఆర్ సంకల్పం, చిత్తశుద్ధి మూలంగానే ఇది సాధ్యమయిందని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా దేశంలో మార్పును తీసుకురావడానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశ ప్రజలు కేసీఆర్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని తెలిపారు.
ప్రజల అభిమానం, ఆశీస్సులతో వారు మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు .