హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తేతెలంగాణ): తెలంగాణలోని అంగన్వాడీ సెంటర్లకు నిధులు పెంచాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవికి రాష్ట్ర మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంగన్వాడీల్లో అమలు చేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించి నిధులు కేటాయించాలని కోరారు.