మైనారిటీలకు జనరల్ స్టడీస్ ఫౌండేషన్‌లో ఉచిత శిక్షణ
మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ద్వారా నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ అందించనున్నట్టు తెలిపారు.
డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో వచ్చే నెల 14లోపు నాంపల్లిలోని మైనారిటీ స్టడీ సర్కిల్లో హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 15 నుంచి శిక్షణ అందించనున్నట్టు పేర్కొన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 85208 60785 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

