హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మం డ లం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆసంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కిశోర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. నాలుగు కోర్సుల్లో ఉచిత శిక్షణ, హాస్టల్భోజన వసతితోపాటు ఉద్యోగం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.