హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మింట్ కాంపౌండ్ హైదరాబాద్‌లోని విద్యుత్తు కార్మికభవన్ 1104 యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం యూనియన్ అదనపు కార్యదర్శి వరప్రసాద్ స్టార్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్టార్ హాస్పిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాసర్‌రెడ్డి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ నిశాంత్‌రెడ్డి విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు, ఆర్ట్టిజన్స్కు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నందన్ ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు చేశారు. ఆర్థోపెడీషియన్ డాక్టర్ అభిషేక్ ఎముకల పటిష్టం, ఇతర ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధీర్, సలహాదారు జనార్దన్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు వేణు, అదనపు కార్యదర్శి భాసర్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరావు పాల్గొన్నారు.