హైదరాబాద్, జూన్3 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో, నాలుగు నెలల పాటు డయాలసిస్ టెక్నీషియన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. 18నుంచి 35 ఏండ్ల వయసు ఉండి ఎస్ఎస్సీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. అర్హులు, ఆసక్తి ఉన్న యువత 10లోపు దరఖా స్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 98485 81100, 90599 02355ను సంప్రదించాలని సూచించారు.