BRAOU | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ట్రాన్స్జెండర్లకు ఉచితంగా డిగ్రీ కోర్సులు అందించనున్నట్టు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఆదివారం ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య అవకాశాన్ని కల్పిస్తున్న మొట్టమొదటి వర్సిటీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని పేర్కొన్నారు.
ఈ కోర్సులో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. వారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్ పేరుతో రూ.500 చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం 040-23680333/ 040-23680555 ఫోన్ నంబర్లలో లేదా www.braou.ac.in / www.online.braou.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.