తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రూప్స్ కోసం ఉచితంగా తరగతులు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సారి కూడా పోలీస్, గ్రూప్స్ (2,3,4) పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. మే 16 నుంచి జనగామ జిల్లా పాలకుర్తిలోని బషారత్ గార్డెన్స్‌లో ఉచిత శిక్షణా తరగుతులు ప్రారంభం అవుతున్నాయి.
పాలకుర్తి నియోజకవర్గంలోని, ప్రత్యేకించి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు లు విజ్ఞప్తి చేశారు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు పాలకుర్తి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆధార్ కార్డు, ఫొటోతో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని వారి ఉద్యోగార్థులకు వారు పిలుపునిచ్చారు.