 
                                                            చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ కుటుంబం సమీపంలోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి పరిశ్రమకు వెళ్ళగా.. తల్లి ఇంటి దగ్గరే ఉంది. ఇంటి బయట దుస్తులను శుభ్రం చేస్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. వారు కూడా ఇక్కడ రసాయన పరిశ్రమలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇది పసిగట్టిన తల్లి, సమీప వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
                            