హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-దానాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19, 21 తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు నిలుస్తున్నాయన్నారు. రైల్వే నిర్వహణ పనులతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని వివరించారు.