బంజారాహిల్స్, ఆగస్టు 10: అర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురిని బుధవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అర్మూర్ నియోజకవర్గంలోని కల్మెడ సర్పంచ్ లావణ్యగౌడ్ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్ ఈ నెల 1న బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి ఆయనపై హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్‌గౌడ్ తుపాకీ కొనడానికి సహకరించిన కొండ సంతోష్‌గౌడ్ (46) నిజామాబాద్‌కు చెం దిన బొంత సుగుణ (40), బాల్కొండకు చెందిన సురేందర్ దయావత్ (56), దయాసాగర్ (36)ను పోలీసులు అరెస్టు చేశారు.