అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 18 : కష్టపడి చదివితే ఏ ఉద్యోగమైనా సాధ్యమని నిరూపించింది ఓ యువతి. ఒకే ప్ర యత్నంలో నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రతిభచాటింది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరుకు చెందిన మురళీధర్‌రెడ్డి, మాధవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కూతురు ఉన్నతి బీటెక్ పూర్తిచేసింది. ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ద్వారా నిర్వహించిన పరీక్షల్లో కెనరా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీవోగా.. న్యూ ఇండియా ఇన్పూరెన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉద్యోగాలు సాధించింది. ఎస్ఎస్సీజీఎల్ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గెజిటెడ్ లెవెల్ సెలెక్షన్స్) ద్వారా నిర్వహించిన పరీక్షలోనూ జీఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ పోస్టు ఎంపిక చేసుకున్నట్టు ఉన్నతి పేర్కొన్నది.