IPS Officers | తెలంగాణ కేడర్‌కు నలుగురు ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అయాషా ఫాతిమా, మహారాష్ట్రకు చెందిన మందారే సోహం సునీల్, రాజస్థాన్‌కు చెందిన మనీషా నెహ్ర, జార్ఖండ్‌కు చెందిన రాహుల్ కాంత్‌లను కేటాయించగా.. తెలంగాణ హోం స్టేట్‌కు చెందిన అభిజిత్ పాండేను మణిపూర్ కేడర్‌కు, ఎస్ దీప్తి చౌహన్‌ను యూపీ కేడర్‌కు కేటాయించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మహిళా ఐపీఎస్‌ల సంఖ్య పెరిగింది. 174 మంది ట్రైనీల్లో 62 మంది మహిళలు ఉండగా.. 35.63 శాతంగా నమోదైంది. ఈ ఏడాది పరేడ్ కమాండర్‌గా తమిళనాడు కేడర్‌కు చెందిన అంజిత్ ఏ నాయర్ నాయకత్వం వహించనున్నారు. మొత్తం 174లో పురుషులు 112, మహిళా ఐపీఎస్‌లు 62 మంది ఉన్నారు. ఇందులో పెళ్లయిన మహిళల్లో 13 మంది కాగా.. పెళ్లి కాని వారు 49 మంది ఉన్నారు. పురుషుల్లో 28 మంది పెళయిన వారు కాగా.. 84 మంది పెళ్లి కానివారున్నారు.
ఈసారి ఐపీఎస్ సాధించిన వారిలో 25 ఏళ్లలోపు పురుషులు 14 మంది ఉండగా.. మహిళలు ఏడుగురు ఉన్నారు. అలాగే 25 నుంచి 28 ఏళ్ల లోపు వారు మొత్తం 87 మంది ఉండగా.. ఇందులో మహిళలు 37, పురుషులు 50 మంది ఉన్నారు. 28 ఏళ్లు పైబడిన వారు మొత్తం 66 మంది కాగా.. 18 మంది మహిళలు, 48 మంది పురుషులు. 88 మంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండగా.. మహిళలు 24 మంది, పురుషులు 64 మంది ఉన్నారు. గతంలో ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేనివారు 86 మంది ఉండగా.. పురుషులు 48 మంది, మహిళలు 38 మంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు 87 మంది ఉన్నారు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి 36 మంది.. ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి 29 మంది, ఎంబీబీఎస్ చేసిన ఎనిమిది మంది, కామర్స్ నుంచి ఎనిమిది మంది, లా చేసిన వారు ఆరుగురు ఐపీఎస్‌లు ఉన్నారు.