శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 22, 2020 , 12:43:13

తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానం-బర్లీ పీట్ నందు రూ.20 లక్షలతో నిర్మించనున్న తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులను టీఆర్ ఎస్ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందన్నారు. కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , మున్సిపల్ చైర్ పర్సన్ సీతమాలక్ష్మి , జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు ఉన్నారు. 


logo