నకిరేకల్, నవంబర్ 21: ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు. లోకల్‌బాడీ ఎన్నికల సమయంలో ఈ కేసు విచారణకు గవర్నర్ అనుమతించడం వెనక ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సువర్ణగార్డెన్ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై రాష్ట్రంలో బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని మండిపడ్డారు.