హైదరాబాద్: సిద్ధిపేటలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) ఆఫీసుపై శుక్రవారం రాత్రి అటాక్ జరిగింది. క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ ఘటన పట్ల నెటిజెన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. పోలీసు శాఖ అసమర్థతను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో పనిచేసిన యూకే మాజీ హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ .. ఆ విధ్వంసం ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో స్పందించారు. ఇలాంటి వీడియోలు చూస్తూ నిద్రలేవడం బాధాకరమని ఆయన అన్నారు. హరీశ్ రావుతో ఎంతో పరిచయం ఉందని, ఆయన పట్ల తనకు వ్యక్తిగతంగా అమితమైన గౌరవం ఉన్నట్లు ఫ్లెమింగ్ తన ట్వీట్లో వెల్లడించారు.
శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలోని క్యాంపు ఆఫీసులోకి చొరబడిన కాంగ్రెస్ గుండాలు.. ముందుగా గేటు తాళాలను బ్రేక్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేశారు. అప్రజాస్వామిక రీతిలో కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించినట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు తన ట్వీట్లో తెలిపారు. ఈ దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమైనట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ గుండాలను అడ్డుకోకుండా.. వాళ్లను పోలీసులు రక్షించినట్లు ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపై అటాక్ జరిగితే, అప్పుడు సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల సమక్షంలో ప్రభుత్వం ప్రాపర్టీని ధ్వంసం చేయడం అమోద్యయోగం కాదు అని, ఈ ఘటన పట్ల రాష్ట్ర డీజీపీ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ తన ట్వీట్లో కోరారు.
Really sad to wake up to these videos. What appears to be depicted can never be right in my mind but I have huge personal respect for @BRSHarish in my many dealings.
— Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) August 17, 2024