హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ‘భారత్ గౌరవ్’ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఆయనతోపాటు సీనియర్ ఐఎఫ్ఏఎస్ అధికారిణి మీనాక్షి నేగి కూడా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ అవార్డులు అందజేశారు. ప్రజాసేవలో, శాంతిభద్రతల పరిరక్షణలో వారు చేసిన సుదీర్ఘ, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురసారం లభించింది. సింపోజియం ట్రస్టీ శ్రుతి మాల్పానికి భారత్ గౌరవ్ అవార్డు ప్రదానం చేశారు.