హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేత వస్త్ర ఉత్పత్తి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తానని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క ర్ తెలిపారు.
ఇందుకు వచ్చే నెల 7లోపు రాష్ట్రంలోని చేనేత, మర మగ్గాల నేతన్నల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. వచ్చే బడ్జెట్లో చేనేత, మరనేత వృత్తి రంగాలకు కేటాయింపుల విషయంలో ప్రభుత్వాలకు స్పష్టమైన సలహాలు, ప్రతిపాదనలు అందించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.