కరీంనగర్ కార్పొరేషన్, మే 7 : బీజేపీ నాయకుల దాడిలో గాయపడి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు దూలం సంపత్‌గౌడ్‌ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అ నిల్ పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.