కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యు ంజయం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి కలెక్టర్‌ను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డ ఆయన, తన ఆవేదనను ఎక్స్‌కే పరిమితం చేయకుండా ఫేస్బుక్, వాట్సాప్‌లోనూ షేర్ చేశారు. ‘రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహార శైలిపై ఒక రాజకీయ అ నుభవజ్ఞుడిగా నా వేదనాత్మక పరిశీలన అంటూ ప్రారంభించారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక జిల్లాల కలెక్టర్లను చూశాను. వా రితో కలిసి పని చేశా ను. కానీ, ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్లా విచిత్రమైన వైఖరి కలిగిన వ్యక్తి. ఎన్నిసార్లు ఆయన నంబర్‌కు ఫోన్ చేసినా, ఒకసారి రింగ్ అయ్యి కట్ అవుతుంది. విషయాన్ని తెలిపిన పరిస్థితిలో మార్పు రాలేదు. కొందరిని పోగుచేయించి, తప్పుడు ఆరోపణ పత్రాలు వారి నుంచి స్వీకరించి, నాపై అభియోగాలను మోపుతూ నన్ను తన కార్యాలయానికి విధిగా హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. కలెక్టర్‌గా జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న వ్యక్తి విరోధం, ప్రతీకార భావనతో ఇలా వ్యవహరించడమంటే అది వ్యక్తిగత స్థాయికి మించిపోయిన ప్ర మాదకర దాడిగా భావిస్తున్నా అని పేర్కొన్నారు.