మునుగోడు ఏప్రిల్20: బీఆర్ఎస్ పార్టీ 27వ రజతోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో జరుగనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై కార్యకర్తలతో చర్చించారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఓ చారిత్రక ఘట్టంగా మిగలాలన్నారు. ఊరు, వాడ దండులా కదిలి సభను జయప్రదం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్లో వెన్నులో వణుకుపుట్టాలన్నారు.