మహబూబ్‌నగర్ : ఎమ్మెల్యే పదవి లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటాను. ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలని, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి( Ala Venkateswara Reddy) అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని క్యూ ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం కొత్తకోట పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ(BRS) కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజార్టీతో ఒడిపోయాం.
నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా ఉండి పనిచేయాలన్నారు. ఇక నుంచి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడదాం. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అందరం పట్టుదలతో పని చేసి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాటం ప్రదీప్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.