హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో, అనంతరం రోశయ్య క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.