హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ‘పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్‌కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహించారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగా ణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, ఇప్పటికైనా క్షమాపణ చెప్పి, వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశా రు. అభిమానం వేరు, ఆత్మగౌరవం వేర ని, తెలంగాణకు గొప్ప చరిత్ర ఉన్నదని, తెలంగాణ ప్రత్యేక సంస్థానంగా ఉన్నప్పుడే 11 దేశాల్లో రాయబార కార్యాలయాలున్నాయని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పక్కన కాళ్లలో కట్టె పెట్టే వాళ్లున్నారని, హిందూ దేవుళ్ల గురించి ఆయన అలా మాట్లాడటం సరికాదని అన్నారు.