హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మహోన్నత స్వాప్నికుడు జయశంకర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సార్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
‘జయశంకర్ సార్ మార్గంలో, కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ ప్రత్యేక స్థానం. జయహో జయశంకర్సర్ పిడికిలెత్తి పలుకుతుంది తెలంగాణ జోహార్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.