Talasani Srinivas : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆ హామీలపై చర్చ పెట్టాలని తాము కోరామని తెలిపారు. ఇవాళ ఉదయం శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా పాయింట్లో తలసాని మాట్లాడారు.
ఫార్ములా వన్ రేసు సందర్భంగా అవినీతి జరిగిందంటూ తమ నాయకుడు కేటీఆర్‌పై కేసు పెట్టారని, ఫార్ములా వన్‌పై చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని తలసాని వెల్లడించారు. శాసనసభలో
తమ దళిత ఎమ్మెల్యేలకు చెప్పులు చూపించారని ఆయన ఆరోపించారు. సభ రికార్డులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాము అన్ని విధాల సభకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.