మహబూబ్‌నగర్ : మహనీయుల బాటలో నడుద్దామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud) పిలుపు నిచ్చారు. పండుగ సాయన్న(Panduga Sayanna), ఏకలవ్య జయంతి వేడుకల్లో భాగంగా మహబూ బ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న విగ్రహాలకు బుధవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు(Tributes). అలాగే హన్వాడ మండలకేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఆలో చనతో కేసీఆర్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్‌లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. వారు సమాజం కోసం చేసిన సేవలను నేటి యువత అందిపుచ్చుకోవాలన్నారు. గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పండుగ సాయన్న ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యాదయ్య, నాయకులు పాల్గొన్నారు.