హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఈ నెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహిస్తున్న టీజేఎఫ్ రజతోత్సవాల వాల్ పోస్టర్‌ను మంగళవారం గన్‌పార్క్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని కొనియాడారు. టీజేఎఫ్ రజతోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీ సాగర్, జర్నలిస్టు సంఘాల నేతలు ఏ రమణ కుమార్, యోగానంద్, అవ్వారి భాసర్, రాకేశ్ రెడ్డి, సోమేశ్వర్, యారా నవీన్, రమణ, శివారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్, భూపతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.