మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : లంబాడీలపై సీఎం రేవంత్రెడ్డి కక్షగట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్ లో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయంబాబురావుతో కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లంబాడీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే 1976లో రాష్ట్రపతి ఆమోదంతో వారికి రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి లంబాడీలు, ఆదివాసీలు కలిసి మెలిసి ఉంటున్న తరుణంలో మళ్లీ కొంతమంది కావాలనే రెచ్చగొట్టే రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు.