హైదరాబాద్ : తాను బీఆర్ఎస్ పార్టీ మారడం లేదని అవన్నీ ఊహాగానాలేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల తాను బీఆర్ఎస్ను వీడుతున్నానని వస్తున్న పూర్తి అవాస్తమన్నారు. కేటీఆర్ 125 ఏండ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నాడనే ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.