హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసా విషయంలో మాట తప్పిన రేవంత్‌రెడ్డిపై రైతుల ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేక కొత్త చికులు కొని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు పంట సాయం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో రూ.12 వేలే ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఆగడాలను అడుగడుగునా ఎండగడుతూ రైతుల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌ను ఫార్ములా-ఈ రేస్ అనే చెత్త కేసుతో జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తన మామగారి సంవత్సరీకం ఉన్నప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ వెళ్లారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి తప్పూ చేయలేదు కాబట్టే ఏసీబీ విచారణకు ఆయన హీరోలా వెళ్లారని స్పష్టంచేశారు. లాయర్‌ను అనుమతించకుండా ఆయనను పోలీసులు 45 నిమిషాలు రోడ్డుపై నిలబెట్టారని తెలిపారు. కేటీఆర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తానంటే.. విచారణాధికారే ఆయన దగ్గరకు వచ్చి లేఖ తీసుకెళ్లడంతో రేవంత్‌రెడ్డి బొక్క బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫార్ములా వన్ కంటే ముందే గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టుకు ఏసీబీ సమర్పించిన 200 పేజీల రిపోర్టులో గ్రీన్కో ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. రైతుల్లో తిరుగుబాటు మొదలవడం వల్లనే రేవంత్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై ఏసీబీ విచారణ డ్రామాలో వైఫల్యం చెందడంతో పనికిమాలిన చెత్తవార్తలు మీడియాకు లీకుల రూపంలో ఇసున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్‌పై తన వ్యూహం బెడిసి కొట్టడంతో ఎలక్టోరల్ బాండ్స్ విషయాన్ని ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా మీడియాకు లీకులిచ్చారని విమర్శించారు.
ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం ఇప్పటిది కాదని, గ్రీన్కో కంపెనీ అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌కు కూడా రూ.27 కోట్ల విరాళాలు ఇచ్చిందని తెలిపారు. చాలా పార్టీలకు బాండ్స్ ఇచ్చాయని, ఇందులో దాపరికం ఏమీ లేదని పేర్కొన్నారు. రేవంత్ తన పరువు పోతుందని ఈ డైవర్షన్ రాజకీయం తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తకువ అనే భ్రమల్లో సీఎం రేవంత్ ఉన్నారని, అన్ని విషయాలు గుర్తుంచుకుంటారని స్పష్టంచేశారు. సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రతి చెత్త వార్తను ప్రచురించడం, ప్రసారం చేయడం తగదని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.