హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై ప్రభు త్వం రైతులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నదని, ఒకే విడత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు విడతల వారీగా చెల్లించడమంటే రైతులను వంచించడమేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కట్టని చేవెళ్లకు కాంగ్రెస్ నేతలు 9 సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవాచేశారు. అసలు ప్రాజెక్టు కట్టకుండానే కాల్వలు తవ్విన చరిత్ర కాంగ్రెస్‌దని ఆగ్రహం మండిపడ్డారు. ప్రజల సొమ్ము దుర్వినియోగమని నాడు మహారాష్ట్ర సీఎం లెటర్ కూడా రాశారని, కాంగ్రెస్ పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు.
కల్యాణలక్ష్మి పథకం లక్షకు అదనంగా తులం బంగా రం, మ హిళలకు నెలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తారు? 500కే గ్యాస్ గ్రామాల్లో మెజార్టీ అర్హులకు రావడంలేదు. దండారియ, కేస్లాపూర్, సమ్మక్క సారలమ్మ వంటి గిరిజన పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. వట్టివాగు కింద కెనాల్స్ ఏర్పాటు చేయాలి. కుమ్రంభీం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ 8నెలలు గడచినా ఏ ఒక్కదాని అమలుపై స్పష్టత ఇవ్వడంలేదు. ఇందుకు చేవేళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషనే నిదర్శనం. దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పథకం పెట్టి రూ.12 లక్షలు అందిస్తామని చెప్పి ఇప్పటికీ ఆచరణ చేపట్టలేదు. సీఎం రేవంత్‌రెడ్డి బోథ్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి.
– ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, బోథ్
పల్లెల్లో పారిశుధ్యం పడకెక్కింది. నిధులన్నీ కొడంగల్, మధిర, ఖమ్మం, నల్లగొండకే ధారపోస్తున్నారు. గ్రామీణరంగానికి గతంతో పోల్చితే బడ్జెట్లో రూ. 1600 కోట్లు తక్కువగా కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తాజా మాజీ సర్పంచ్‌లకు గ్రామ పంచాయతీ బకాయిలు చెల్లించాలి. ఎన్నికల హామీ మేరకు మాజీ సర్పంచ్‌లకు, మాజీ ఎంపీటీసీ, మాజీ జడ్పీటీసీలకు పెన్షన్ ఇవ్వాలి.
శాసనసభ నడుస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉంది. ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టు బయటికి లోపలికి తిరుగుతున్నారు. సభలో తోటి ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ ఉండటం లేదు. క్రమశిక్షణగా ఉండి తర్వాతితరాలకు మనం ఆదర్శంగా నిలవాలి. వీఆర్ఏ, వీఆర్వోలను నియమించాలి. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తే నా సూల్ను మూసేసేందుకు సిద్ధం.
అభివృద్ధిలో ఉత్తర, దక్షిణ తెలంగాణలకు సమప్రాధాన్యమివ్వాలి. సివిల్ సప్లయ్ కింద 53వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి, 3 వేల కోట్లే రికవరీగా చూపారు. ఇంతతేడా ఎందు కొచ్చిందో చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పీఎంఎస్కేవైతోపాటు కేంద్రం నిధులను తీసుకోవాలి. ప్రాణహిత లేదంటే వార్ధా ప్రాజెక్టును సత్వరమే చేపట్టాలి.
ప్రభుత్వం కులగణన ఎప్పుడు చేస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పా రు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి.