హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర రిపోర్టు, బీఆర్ఎస్ రజతోత్సవం వేళ తుది రిపోర్టు ఎన్డీఎస్ఏ విడుదల చేయడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్ర ఉన్నదని మండిపడ్డారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాల నిర్వహణతోపాటు ఆర్టీఏ అధికారులతో వాహనదారులను వేధింపులకు గురిచేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని చెప్పారు. ఊరువాడా, పల్లె పట్టణం అంతటా కేసీఆర్ ప్రసంగంపైనే చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డంపెట్టుకొని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అఅబద్ధాలు, అసత్యాలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్‌సభలో వ్యతిరేకించిన ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లాగా కనపడుతున్నదని విమర్శించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎకడా చెప్పలేదని, కానీ, అవినీతి జరిగిందని చెప్పడానికి ఉత్తమ్ ప్రయాసలు చూస్తే జాలేసుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఎన్డీఎస్ఏ
ఎన్డీఎస్ఏ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని, బ్లాక్ 7 తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకురావచ్చని చెప్పిందని హరీశ్‌రావు తెలిపారు. రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయవద్దని, తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు ఎంతో ఉన్నాయని, వర్షాలు లేకుంటే మంచి నీళ్లు కూడా దొరకవని, వేగవంతంగా ప్రాజెక్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారుపై మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలు, పేరాలు, పేజీలు, ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని, అబద్ధాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఎన్డీఎస్ఏ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్, గైడ్‌వాల్ కుప్ప కూలిందని, నాలుగైదేండ్లు అయినా పోలవరానికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థగా ఎన్డీఎస్ఏను ఉత్తమ్ అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముంది?
మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ ప్రాజెక్టును డిజాస్టర్ అనడంపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముందని, 60 రోజులైనా ఎనిమిది మృతదేహాలను ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కూడా తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ఎనిమిదేండ్లలో అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోయారు? అంతర్ రాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేకపోయారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? మీరు పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా, కమీషన్ల కోసం, పర్సెంటీజీల కోసం టెండర్లు పిలిచి, ఎకడో చేవెళ్ల కాడ తవ్వారు. నాలుగేండ్లలో పూర్తవుతుందని చెప్పి ఏండ్లయినా చేయలేకపోయారు. సిగ్గులేదా? తలకాయ ఎకడ పెట్టుకుంటారు ఉత్తమ్’ అని ప్రశ్నించారు. సర్వే మొబిలేజేషన్ అడ్వాన్స్ పేరిట 1,426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని, ఈ తప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం సరిచేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల సర్వే నివేదికల ఆధారంగా, సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పారు.
ఆరు ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా?
ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారని, ఇప్పటివరకు ఆరువేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. పెద్దవాగు తెగిపోయింది. ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది. వట్టెం వాగు కొట్టుకుపోయిందని విమర్శించారు. తెలంగాణ నీటి పారుదలశాఖ ఎంత దీన స్థితిలో ఉందో ఆశాఖలో ఖాళీలను చూస్తే తెలుస్తుందన్నారు. సెక్షన్ 3 నదీ జలాల మీద ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతుంటే, పూర్తి స్థాయి సీఈ, ఎస్ఈ లేక డిప్యూటీ ఈఈ మాత్రమే హాజరవుతున్నారని, ఆయన ఫ్లైట్‌లో వెళ్లి బిల్లులు పెట్టుకొంటే నేటికీ క్లియర్ కాలేదని మండిపడ్డారు.
కొడంగల్ లిఫ్టుకు డీపీఆర్ ఉన్నదా?
కొడంగల్-నారాయణపేట లిఫ్టుకు ఇప్పటివరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఉన్నదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. టెండర్లు పిలిచి, ప్రాజెక్టు ఎలా కడుతున్నారని నిలదీశారు. ‘సమాచార హకు చట్టం కింద కొడంగల్ ప్రాజెక్టుకు ఇప్పటికీ డీపీఆర్ లేదని సమాధానం ఇచ్చారు. మిస్టర్ ఉత్తం.. మీకో నీతి.. మాకో నీతా? 2007 ప్రాణహితకు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, వేలకోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారు. 2010లో డీపీఆర్ సబ్మిట్ చేశారు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ముందు నీ వీపు చూసుకో ఉత్తంకుమార్‌రెడ్డి’ అని ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పులు తెచ్చామని, మీలాగా బ్రోకర్‌కు పైసలు ఇచ్చి తేలేదని స్పష్టంచేశారు.
అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సరారు రేవంత్ సరారు అని, ఇంతకంటే దివాలాకోరు తనం, దికుమాలిన తనం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జియాలాజికల్ సర్వే ప్రకారంగానే అన్నారం, సుందిళ్ల లొకేషన్ మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టు మారలేదా? పరిస్థితులు, ముంపు, అవసరాలను బట్టి మారుతాయని, హైలెవెల్ కమిటీ మేరకు డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయంపై పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 231 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్.. ఇవన్నీ బాగున్నాయని, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నుంచి ఇప్పటికీ సాగు నీళ్లు వస్తున్నాయని, ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. మరి లక్ష కోట్లు వృథా అయితే నీళ్లు ఎట్ల వస్తున్నయ్ అని నిలదీశారు.
ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్‌సభలో వ్యతిరేకించిన ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్లా కనపడుతున్నది. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎకడా చెప్పలేదు.
-హరీశ్‌రావు
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మేం అప్పులు తెచ్చాం. మీలాగా బ్రోకర్‌కు పైసలు ఇచ్చి తేలేదు. అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సరారు రేవంత్ సరారు. ఇంతకంటే దివాలాకోరు తనం మరొకటి ఉండదు.
-హరీశ్‌రావు