ఆర్కేపురం, ఆగస్టు 14: అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్‌ను బుధవారం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ కొత్తపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఉన్న ఆయన మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ నేతలు అరవింద్‌శర్మ, నగేశ్, రామనర్సింహ, సాజీద్, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.