హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసినా, ఐపీఎస్‌గా రిటైరైనా.. వయసుతో సంబంధం లేకుం డా తాజాగా లాసెట్ ప్రవేశ పరీక్ష రాశారు ఏబీ వెంకటేశ్వరరావు. గురువారం ఒంగోలు జిల్లాకేంద్రంలోని రైజ్ ఇన్స్టిట్యూట్లో లాసెట్ ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. రిటైర్డ్ డీజీపీ లాసెట్ పరీక్షకు హాజరుకావడంపై తోటి అభ్యర్థులతోపాటు అధ్యాపకు లు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భం గా పలువురు ఆయనపై ప్రశంసలు కురుపిస్తున్నారు.
కాగా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయన్న కారణంతో అరెస్టు చేసి శిక్షించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావును అప్పటి ప్రభుత్వం తీవ్రంగా వేధించిందన్న ఆరోపణలున్నాయి.