ఏపీ మాజీ డీజీపీ కుమారుడి దౌర్జన్యం.. అమ్మాయి విషయంలో పబ్‌లో గొడవ
అమ్మాయి విషయంలో ఏర్పడ్డ మనస్పర్థలతో ఒక పబ్‌లో ఏపీ మాజీ డీజీపీ కుమారుడు హంగామా సృష్టిస్తూ.. యువకులపై దాడికి దిగాడు. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలో నివాసముండే ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ (29)కు సమద్ స్నేహితుడు. వీరికి మాసబ్‌ట్యాంక్ ప్రాంతవాసి సిద్దార్థ మాగ్నాని అనే యువకుడితో ఓ యువతి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి.
బంజారాహిల్స్, సెప్టెంబర్ 14: అమ్మాయి విషయంలో ఏర్పడ్డ మనస్పర్థలతో ఒక పబ్‌లో ఏపీ మాజీ డీజీపీ కుమారుడు హంగామా సృష్టిస్తూ.. యువకులపై దాడికి దిగాడు. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలో నివాసముండే ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ (29)కు సమద్ స్నేహితుడు. వీరికి మాసబ్‌ట్యాంక్ ప్రాంతవాసి సిద్దార్థ మాగ్నాని అనే యువకుడితో ఓ యువతి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. పబ్స్‌లో మ్యూజిక్ లైవ్ బ్యాండ్ నిర్వహించే సమద్‌కు మయూర్ అనే స్నేహితుడు ఉన్నాడు.
బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.10లోని 040 పబ్‌లో సమద్తోపాటు మయూర్ లైవ్‌బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి మయూర్ స్నేహితులతోపాటు డేవిడ్ సవాంగ్ దోస్తులు వచ్చారు. అక్కడ మయూర్ స్నేహితులు వీడియో తీస్తుండగా, ఎందుకు తీస్తున్నావంటూ డేవిడ్ స్నేహితులు గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పబ్ సిబ్బంది వారిని బయటకు పంపించారు. బయట ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడుల్లో డేవిడ్‌తోపాటు మయూర్ స్నేహితుడు సిద్దార్థ కూడా గాయాలయ్యాయి. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

