హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను పూర్తిస్థాయి ప్లాస్టిక్ఫ్రీ జోన్లుగా మార్చాలని అటవీశాఖ నిర్ణయించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో అమలుచేస్తున్న చెత్త సేకరణ, ప్లాస్టిక్ రీసైకిలింగ్ విధానాన్ని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నారు.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు, కేబీఆర్, మృగవని, హరిణవనస్థలి జాతీయ ఉద్యానవనాలు, పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం అభయారణ్యాలతో పాటు 109 అర్బన్ ఫారెస్ట్ పారులు, జూ పారుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ ఆదేశాలు జారీచేశారు.