హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తిస్థాయి ప్లాస్టిక్ రహిత జోన్లుగా మార్చాలన్న అటవీశాఖ నిర్ణయాన్ని ఎంపీ సంతోష్‌కుమార్ అభినందించారు. ‘అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియల్ ఆలోచన చాలా బాగున్నది. ప్లాస్టిక్ అనేది ప్రకృతికి చాలా నష్టం కలిగిస్తున్నది. ప్లాస్టిక్ వ్య ర్థాలను నిర్మూలిం చేం దుకు మనమంతా కలిసి ప్రయత్నించాల్సిన సమ యం ఆసన్నమైంది’ అని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆదివారం ట్వీట్ చేశారు.