హైదరాబాద్, జూన్ 9 (నమస్తేతెలంగాణ) : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్)లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, ఏపీ పీసీసీఎఫ్ చిరంజీవి దరి సంయుక్తంగా నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో వారు సమావేశమై, పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
ఇరు రాష్ట్రాల అడవుల సరిహద్దు సమస్యలు, నివాస నిర్వహణ, రక్షణ అంశాలపై చర్చించారు. ఏటీఆర్, ఎన్ఎస్టీఆర్ల ప్రాంతాల్లో ప్రత్యేకంగా తాగునీటి కోసం ప్రత్యామ్నాయం అందించాలని చెప్పారు. సమావేశంలో ఏపీ చీఫ్ వైల్డ్ వార్డెన్ (సీడబ్ల్యూడబ్ల్యూ) ఏకే నాయక్, ఏటీఆర్, ఎన్ఎస్టీఆర్ నుండి రెండు బృందాల అధికారులు పాల్గొన్నారు.