అందోల్, ఏప్రిల్ 27 : సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం ఫర్ ఫారినర్స్ (విదేశీయుల కేంద్రం)కు విదేశీ రిమాండ్ ఖైదీలను తీసుకువచ్చారు. వివిధ దేశాలకు చెందిన 13 మంది ఖైదీలు పలు నేరారోపణల్లో దోషులు గా ఉండి, హైదరాబాద్లోని జైలులో శిక్ష అనుభవిస్తుండగా వారిని సోమవారం జోగిపేటకు తరలించారు. వీ రిలో 10 మంది పురుషులు, ముగ్గురు మహిళా ఖైదీలు ఉన్నారు. వీరికి జైలులో ఎలాంటి ఇబ్బందులు రాకు ండా తగిన ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారి ఖాన్ తెలిపారు.