హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించాలని వివిధ శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార సూచించారు. బుధవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రధా న ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు, హౌ జింగ్ కార్పొరేషన్, హౌజింగ్ బోర్డ్, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులతో అదనపు వనరుల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై చర్చించారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ శాఖల పరిధిలో ఇప్పటివరకు జరిగిన భూ అమ్మకా లు, తద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదా యం, ఇంకా రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు సమకూర్చుకొనేందుకు కార్యాచరణ రూపొందించి నిధులను రాబట్టాలని సూచించారు. ప్రతి పైసాను ఎట్టిపరిస్థితుల్లో వదలొద్దని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పారులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
తూప్రాన్ ఇం డస్ట్రియల్ పారుకు ప్రభుత్వం 325 ఎకరాలు కేటాయించగా, 139 ఎకరాలు అప్పగించారని, మిగతా భూమిని సేకరించాల్సి ఉన్నదని తెలిపారు. పరిశ్రమల శాఖ పరిధిలో జాయిం ట్ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరులపై ఆరా తీసి, సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. హౌజింగ్బోర్డ్ చేపట్టిన 12 జాయింట్ వెంచర్స్ ప్రాజెక్టులో ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వానికి రూ. 955 కోట్లు రావాల్సి ఉండగా, రూ.430 కోట్లు వచ్చాయని తెలిపారు. మిగతా రూ.525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయంలో పెండింగ్ గురించి భట్టి మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక కొరత లేకుం డా చూడాలని చెప్పారు. సమావేశంలో గను లు భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్‌దత్ ఎకా, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, పరిశ్రమలశాఖ డైరెక్టర్ రెహమాన్, హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ విజయేంద్ర బోయి, హౌజింగ్ బోర్డు ఎండీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.