Harish Rao | అధ్వాన్న స్థితికి గురుకులాలు.. సీఎం రేవంత్ ఇప్పటికైనా మొద్దునిద్ర వీడండి: హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతుల కల్పణపై తక్షణమే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారురు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతుల కల్పణపై తక్షణమే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారురు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. మీ పాలన ఎలా ఉందొ చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు. గత 8 నెలల్లో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డే బాధ్యుడని చెప్పారు.
‘మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి. నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి.
మిస్టర్ రేవంత్ రెడ్డి.. గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్.?, పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావ్.? కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్?. గత 8 నెలల కాలంలో 500 మంది పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివి. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు. మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టు.’ అంటూ ట్వీట్ చేశారు.
మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి.
నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి.
మిస్టర్ రేవంత్ రెడ్డి..
గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్ .?… pic.twitter.com/EPeysGATwl— Harish Rao Thanneeru (@BRSHarish) August 29, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

