హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల (ఎఫ్ఎంజీ) ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులను ఏప్రిల్ 18 వరకు స్వీకరిస్తామని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ హనుమంతరావు తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఎఫ్ఎంజీ మార్కుల షీట్లను ఏప్రిల్ 15 వరకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ఏప్రిల్ 20న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.