హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేసి నగదు, అక్రమ మద్యం పట్టుకొంటున్నాయి. సోమవారం హైదరాబాద్ జిల్లాలో రూ.1,63, 300ల నగదును సీజ్ చేశాయి.
ఇప్పటివరకు రూ.3,49,75,450 నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్ అథారిటీ ద్వారా రూ.1, 82,85,265ల నగదు సీజ్ చేశామన్నారు. ఇప్పటికీ రూ.48,83, 66,411 నగదును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 600 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.